ఏపీలోని నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరుకు చెందిన సాయినాథ్ రెడ్డి.. తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లోని బీజాపూర్ వద్ద రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉద్యోగరీత్యా తెలంగాణలో నివసిస్తుండగా.. అతడి శరీరం, మొండెం బీజాపూర్ వద్ద వేరుగా పడి ఉన్నాయని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
పెళ్లైన 45రోజులకే.. యువకుడు మృతి - బీజాపూర్ వద్ద రైల్వే ట్రాక్‌పై దువ్వూరుకు చెందిన నవ వరుడు మృతి
పెళ్లై 45 రోజులు కాక ముందే ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లోని బీజాపూర్ వద్ద.. అతడి శరీరం, మొండెం వేరుగా పడి ఉన్నాయి. మృతుడిని నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరుకు చెందిన సాయినాథ్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.
అనుమానాస్పదం: రైల్వేట్రాక్‌పై నవ వరుడి మృతదేహం
మృతదేహం పక్కనే ద్విచక్రవానంతో పాటు సాయినాథ్ రెడ్డి వస్తువులు పడి వున్నాయి. పెళ్లై 45 రోజులు కాక ముందే అనుమానాస్పద స్థితిలో అతడు మృతి చెందగా.. కుటుంబం సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
ఇవీచూడండి:లైవ్ వీడియో: ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ