తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

జర జాగ్రత్త: కరోనా వ్యాక్సిన్ పేరుతో సైబర్‌ వల - వ్యాక్సిన్ వార్తలు

కరోనా టీకా పేరుతో సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. వ్యాక్సిన్ కోసం పేరు నమోదు చేసుకోవాలంటూ వల వేస్తున్నారు. ఆధార్‌కార్డు, బ్యాంక్ ఖాతా, ఓటీపీలు అడుగుతున్నారు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్​ సూచించారు.

corona vaccine
corona vaccine

By

Published : Dec 30, 2020, 8:56 PM IST

కరోనా వ్యాక్సిన్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. త్వరలో వ్యాక్సిన్ రాబోతుందని ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఆధార్ కార్డు, బ్యాంక్, మొబైల్ నంబర్​కు వచ్చే ఓటీపీ వివరాలను అడుగుతున్నారని...ఇలాంటి వివరాలు ఎవరికీ చెప్పొద్దన్నారు. ఎలాంటి అనుమానం ఉన్నా డయల్ 100 లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444 సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఇదీ చదవండి :లోన్​ యాప్​ కేసు: రూ.21 వేలకోట్ల రుణం.. చైనీయుడి అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details