ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 8న... మౌనిక, సురేష్ ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ప్రేమ వివాహం గురించి పీఎస్‌లో సమాచారం ఇవ్వగా... ఇద్దరి తల్లిదండ్రులను పోలీసులు పిలిచి చెప్పారు. ఈ వివాహం మౌనిక కుటుంబసభ్యులకు నచ్చలేదు. ఆమె పేరుపై ఉన్న ఆస్తులకు సంబంధించి... బాండ్ పేపర్‌పై బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. ఎస్సై బురాన్ మూడు రోజులుగా... సురేష్ కుటుంబసభ్యులను ఇబ్బంది పెడుతున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
'కేటీఆర్ సార్.. ప్రేమించుకున్నాం.. రక్షణ కల్పించండి' - రక్షణ కోసం డీజీపీకి ఫిర్యాదు
ప్రేమ వివాహం ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు యువకుడిని బెదిరిస్తున్న ఘటన హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యువకుడిని హత్య చేస్తామని బెదిరిస్తున్నట్టు ప్రేమ జంట ఆరోపిస్తున్నారు.
స్టేషన్‌కు వచ్చి మౌనికను అప్పగించకపోతే... తప్పుడు కేసులు పెడతానని బెదిరిస్తున్నట్టు బాధితులు.. ట్విట్టర్ ద్వారా కేటీఆర్, డీజీపీకి ఫిర్యాదు చేశారు. మిర్యాలగూడ ప్రణయ్‌ను చేసినట్టు హత్య చేస్తామని బెదిరిస్తున్నారు, మాకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. కానీ పోలీసులు మాత్రం అలాంటిదేం లేదని, మౌనికకు ఇష్టం లేకున్నా... వారి వద్ద ఉంచుకున్నారని తెలిపారు. మౌనికపై ఆమె తల్లిదండ్రులు దొంగతనం కేసు పెట్టడం వల్ల స్టేషన్‌కు పిలిపించినట్టు పోలీసులు చెప్తున్నారు.
ఇదీ చూడండి:కుమురంభీం జిల్లాలో అక్రమ కలప పట్టివేత