తెలంగాణ

telangana

చపాతీలో మత్తు కలిపారు.. ఉన్నదంతా దోచేశారు

By

Published : Oct 6, 2020, 12:26 PM IST

Updated : Oct 6, 2020, 2:16 PM IST

Nepal gang robbery in Rayadurgam dnr hills
చపాతీలో మత్తు కలిపారు.. ఉన్నదంతా దోచేశారు

10:12 October 06

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న మాట.. నేపాల్​ దొంగల ముఠా నిజం చేసింది. ఉపాధి కోసమంటూ.. పొట్ట చేతబట్టుకొని పట్నమొచ్చి.. ఓ కాంట్రాక్టర్​ ఇంట్లో ఇంటిపనికి కుదిరారు. నమ్మి పని ఇచ్చినందుకు.. అదును చూసి అసలు బుద్ధి బయట పెట్టారు.యజమానులకు రాత్రి భోజనంలో మత్తు మందు కలిపి.. వారు స్పృహ కోల్పోగానే.. ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్​ శివారులోని రాయదుర్గంలో చోటు చేసుకుంది.

చపాతీలో మత్తు కలిపారు.. ఉన్నదంతా దోచేశారు

    హైదరాబాద్‌ రాయదుర్గంలో నేపాల్‌కు చెందిన ఓ ముఠా భారీ చోరీకి పాల్పడింది. యాజమానులకు మత్తుమందు ఇచ్చి.. 15లక్షల నగదు, 5 తులాల బంగారం దోచుకెళ్లారు. డీఎన్‌ఆర్‌ హిల్స్‌లో నివాసముంటున్న కాంట్రాక్టర్‌ మధుసూదన్ రెడ్డి ఇంట్లో... గత కొంతకాలంగా నేపాల్‌ వాసులు పనిచేస్తున్నారు. రాత్రి భోజనంలో యజమానులకు మత్తు మందు ఇచ్చి.. వారు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాక చోరీకి పాల్పడ్డారు. నలుగురు సభ్యులు చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్న పోలీసులు... సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మధుసూదన్‌ రెడ్డితో పాటు అతని భార్య పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

     నిందితులైన రాజేందర్​ అలియాస్ రవి, అతని మేనకోడలు సీత, జానకి, మనోజ్​లు గత కొద్ది కాలంగా మధుసూదన్​ రెడ్డి ఇంట్లో పని మనుషులుగా చేరారు. కాంట్రాక్టర్​ అయిన మధుసూదన్​ రెడ్డి నగదు, బంగారం ఎక్కడ దాస్తారో పసిగట్టి.. పక్కా ప్లాన్​ ప్రకారమే యజమానులకు మత్తు మందు ఇచ్చి.. దొంగతనానికి పాల్పడ్డట్టు డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. 

       నిందితులు చపాతీల్లో మత్తు మందు కలిపి మధుసూదన్​ రెడ్డితో పాటు.. అతడి భార్య, కుమారుడు, కోడలు, మనవడికి ఇచ్చారు. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లాక చోరీ చేశారు. నిందితులు.. విలువైన ఆభరణాలు, నగదుతో పాటు.. ఎలాంటి ఆధారాలు లేకుండా.. సీసీటీవీల డీవీఆర్, బాధితుల సెల్​ఫోన్​లు కూడా ఎత్తుకెళ్లినట్టు డీసీపీ తెలిపారు. నిందితులు హైదరాబాద్​లోనే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో గాలింపు చర్యలు చేపట్టి.. తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇదీ చదవండిఃకూరగాయల మార్కెట్ షెడ్డులో అగ్నిప్రమాదం

Last Updated : Oct 6, 2020, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details