రాయదుర్గం చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్టు - Nepal gang arrest latest news
10:16 October 12
రాయదుర్గం చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్టు
హైదరాబాద్ రాయదుర్గం చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్టు అయింది. ముఠాలో ముగ్గురిని మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.
వారం క్రితం రాయదుర్గం బీఎన్‌ఆర్ హిల్స్‌లో బోర్‌వెల్ వ్యాపారి మధుసూదన్‌రెడ్డి ఇంట్లో ముఠా చోరీకి పాల్పడింది. మధుసూదన్‌రెడ్డి ఇంట్లో పని మనుషులుగా నేపాల్ ముఠా చేరింది. యజమానులతో నమ్మకంగా మెలిగి చోరీకి పాల్పడ్డారు. నిందితులు మధుసూదన్‌రెడ్డితో పాటు కుటుంబసభ్యులకు మత్తుమందు కలిపి ఇచ్చి... దొంగతనం చేశారు. యజమానులు అపస్మారకస్థితిలోకి వెళ్లాక నగదు, బంగారం దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు. ఇవాళ ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేశారు.