మెదక్ జిల్లా నర్సాపూర్ లంచం కేసులో నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవో అరుణ రెడ్డితో పాటు మరో ముగ్గురు నిందితులను అవినీతి నిరోధక శాఖ అధికారులు 3 రోజుల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో రూ. కోటి 12 లక్షల లంచం తీసుకున్న నగేశ్ పైనే అనిశా అధికారులు దృష్టి కేంద్రీకరించారు.
నేటితో ముగియనున్న నగేశ్ కస్టడీ... కీలక ఆస్తుల గుర్తింపు - narsapur additional collector case updates
నర్సాపూర్ లంచం కేసులో నిందితుడు నగేశ్ కస్టడీ నేటితో ముగియనుంది. మూడు రోజులుగా నగేశ్‌ను ప్రశ్నించిన అధికారులు... పలు బినామీ ఆస్తులను గుర్తించారు. పలు ప్రశ్నలకు సమాధానం దాటవేయగా... చివరి రోజైనా కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
మూడు రోజులుగా నగేశ్‌ను ప్రశ్నించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు అతని బినామీ వ్యక్తులను గుర్తించి వారి నుంచి వివరాలు సేకరించారు. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో కూడబెట్టిన బినామీ ఆస్తులను అధికారులు గుర్తించారు. గతంలో నగేశ్ పనిచేసిన నిర్మల్‌తో పాటు మెదక్‌లోనూ భూములు కొనుగోలు చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. పలు ప్రశ్నలకు నగేశ్... సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. చివరి రోజైనా... నగేశ్ నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.