తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నర్సాపూర్‌ కేసులో నిందితులకు ఈనెల 24 వరకు రిమాండ్

అనిశా న్యాయస్థానంలో నర్సాపూర్‌ లంచం కేసులో నిందితులు హాజరయ్యారు. కరోనా వైద్యపరీక్షల అనంతరం కోర్టులో అ.ని.శా అధికారులు వారిని కోర్టులో హాజరు పరిచారు. నిందితులకు ఈనెల 24 వరకు రిమాండ్ విధిస్తూ వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

narsapur-bribery-case-defendant-appear-in-acb-court-hyderabad
నర్సాపూర్‌ కేసులో నిందితులకు ఈనెల 24 వరకు రిమాండ్

By

Published : Sep 10, 2020, 9:19 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ లంచం కేసులో ఐదుగురు నిందితులను అవినీతి నిరోధక శాఖ అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఉస్మానియా ఆసుపత్రిలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో అరుణారెడ్డితోపాటు మిగతా ముగ్గురు నిందితులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులకు ఈనెల 24 వరకు రిమాండ్ విధిస్తూ వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కోటి 12 లక్షల లంచం కేసులో నగేష్‌తోపాటు... ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం, నగేష్ బినామీ జీవన్‌గౌడ్‌లను.. అ.ని.శా అధికారులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లోని అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో... ఐదుగురు నిందితులను దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించారు.

నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తికి చెందిన 112 ఎకరాల భూమికి సంబంధించిన వివరాలను... నిందితుల నుంచి మరోసారి అడిగి తెలుసుకున్నారు. నిషేధిత చట్టం కింద ఉన్న 112 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా మెదక్ మాజీ ఉన్నతాధికారి రిజిస్ట్రేషన్ శాఖకు రాసిన లేఖను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో ఇతర ఉన్నత అధికారుల పాత్ర ఏమైనా ఉందా అని నగేష్‌ను అధికారులు ప్రశ్నించారు. అతని క్యాంపు కార్యాలయంలో దొరికిన పత్రాలను పరిశీలిస్తున్నారు.

ఇదీ చూడండి :అనిశాకు చిక్కిన మరో తిమింగలం.. కోటి 12 లక్షల అవినీతి

ABOUT THE AUTHOR

...view details