రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నర్సాపూర్ లంచం కేసులో నిందితులకు అనిశా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆర్డీవో అరుణ, వసీం, జీవన్ గౌడ్‌కు బెయిల్ మంజూరయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తహసీల్దార్ సత్తార్‌కు రెండు రోజుల క్రితం బెయిల్ మంజూరైంది. వీరితో కలిపి ఈ కేసులో నలుగురు నిందితులకు బెయిల్ వచ్చింది.
నర్సాపూర్ లంచం కేసులో నిందితులకు బెయిల్ మంజూరు
నర్సాపూర్ లంచం కేసులో నిందితులకు అనిశా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆర్డీవో అరుణ, వసీం, జీవన్ గౌడ్‌కు బెయిల్ మంజూరయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తహసీల్దార్ సత్తార్‌కు రెండు రోజుల క్రితం బెయిల్ మంజూరైంది.
అదనపు కలెక్టర్ నగేశ్ మినహా అందరికి బెయిల్ లభించింది. నగేశ్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును అనిశా అధికారులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో ఆయన చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇవ్వడానికి అదనపు కలెక్టరు నగేశ్‌తో పాటు, ఆర్డీవో అరుణ రెడ్డి, తహసీల్దార్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం, జీవన్ గౌడ్ లంచం తీసుకున్నట్లు అనిశా అధికారుల దర్యాప్తులో తేలింది.
ఇదీ చదవండి:బండి సంజయ్‌కు వైద్య పరీక్షలు.. క్షీణిస్తున్న ఆరోగ్యం