తెలంగాణ

telangana

By

Published : Oct 24, 2020, 10:14 AM IST

ETV Bharat / jagte-raho

ఒంటరి వృద్ధ మహిళలే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లో చోరీలు

అంతర్​ రాష్ట్ర దొంగల ముఠాను నల్గొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉండే వృద్ధ మహిళలే లక్ష్యంగా వీరు దొంగతనాలకు పాల్పడుతున్నట్టు విచారణలో వెల్లడైందని డీఐజీ ఏవీ రంగనాథ్ తెలిపారు. వీరు నుంచి రూ.46.50 లక్షల విలువైన ఆభరణాలు, బైకులు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

nalgonda two town police arrested inter state thieves gang
ఒంటరి వృద్ధ మహిళలే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లో చోరీలు: డీఐజీ

వృద్ధులు ఒంటరిగా ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్​ రాష్ట్ర దొంగల ముఠాను నల్గొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటు పడి... దొంగతనాలకు చేస్తున్నట్టు డీఐజీ ఏవీ రంగనాథ్ తెలిపారు. పానగల్​ బైపాస్​ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా... రెండు బైకులపై అనుమానస్పదంగా వస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, ఖమ్మం, గుంటూరు జిల్లాల్లో చోరీలు చేస్తున్నట్టు ఒప్పకున్నారు.

వీరు ముఖ్యంగా పింఛన్​ కోసం వచ్చే వృద్ధ మహిళలను టార్గెట్​ చేస్తారు. ఇంటికెళ్లే క్రమంలో అనుసరించి... ఇంటి ముందు ఆరవేసిన బట్టలు, గుమ్మం దగ్గర ఉన్న చెప్పుల ఆధారంగా ఒంటరిగా ఉంటున్నారా? ఇంకెవరైనా ఉంటున్నారా? అని గమనిస్తారు. ఒంటరిగానే ఉంటున్నారని నిర్ధరించుకున్న తర్వాత గోడదూకి ఇంట్లోకి వెళ్లి బెదిరించి చోరీలు చేస్తారు. వీరి నుంచి 900 గ్రాముల బంగారం, రెండు బైకులు, ఐదు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్టు, వీటి విలువ రూ.46.50 లక్షల విలువ చేయనున్నట్టు తెలిపారు.

ఇదీ చూడండి:'అన్నదాతలు నష్టపోవద్దనే మక్కలు కొంటున్నాం'

ABOUT THE AUTHOR

...view details