నల్గొండ జిల్లా ఎస్పీ ఫేస్బుక్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. రంగనాథ్ ఆవులవెంకట పేరుతో ఫేస్బుక్ ఖాతా క్రియేట్ చేసి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. రిక్వెస్ట్ ఓకే అయిన వెంటనే.. ఛాటింగ్ చేసి.. తాము చెప్పిన అకౌంట్‌కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపాలని మెసేజ్‌లు పెట్టారు. అనిత అనే ఒరిస్సా మహిళ పేరుతో ఉన్న గూగుల్ పే, ఫోన్ పే నెంబరు పంపి.. డబ్బులు పంపగానే.. స్క్రీన్‌షాట్ తీసి పంపాలంటూ సందేశాల్లో కోరారు.
నల్గొండ ఎస్పీ అకౌంట్ హ్యాక్.. డబ్బుల వసూళ్లకు పాల్పడిన కేటుగాళ్లు! - నల్గొండ ఎస్పీ
సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు సామాన్యులు, అమాయకులనే కాదు.. రాజకీయ నాయకులు, పోలీసులను కూడా వదలడం లేదు. ఈసారి ఏకంగా జిల్లా ఎస్పీ సోషల్ మీడియా అకౌంట్‌నే హ్యాక్ చేశారు. అంతేకాదు.. తాము చెప్పిన అకౌంటుకు డబ్బులు పంపి.. స్క్రీన్షాట్లు పంపాలని బెదిరించారు.
నల్గొండ ఎస్పీ అకౌంట్ హ్యాక్.. డబ్బుల వసూళ్లకు పాల్పడిన కేటుగాళ్లు!
ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ రంగనాథ్ ప్రస్తుతం రిక్వెస్టులు వస్తున్న ఫేస్బుక్ ఖాతాను రెండేళ్ల క్రితమే వాడడం మానేసినట్టు తెలిపారు అది తన ఐడీ కాదని.. ఎవరూ నమ్మి ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చేయవద్దని, డబ్బులు పంపి మోసపోవద్దని సూచించారు. తన ఫేస్బుక్ అకౌంట్ హ్యాకింగ్‌పై ఫిర్యాదు చేసి.. నిందితులను త్వరలో పట్టుకోనున్నట్టు ఎస్పీ తెలిపారు.