తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మిర్యాలగూడలో రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదు - latest crime news in nalgonda

nalgonda district court order to police case file on ram gapal varma
రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

By

Published : Jul 4, 2020, 3:49 PM IST

Updated : Jul 4, 2020, 4:29 PM IST

15:45 July 04

రామ్‌గోపాల్ ‌వర్మపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదు చేయాలని నల్గొండ కోర్టు పోలీసులను ఆదేశించింది. మర్డర్‌ సినిమా చిత్రీకరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రణయ్‌ తండ్రి బాలస్వామి ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్​ వేశారు.  చిత్రం కోసం ప్రణయ్‌, అమృత, మారుతీరావు ఫొటోలు వాడారని వ్యాజ్యంలో పేర్కొన్నారు. నిర్మించబోయే సినిమా.. తన కొడుకు హత్య  కేసును తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు.  

బాలస్వామి పిటిషన్‌పై స్పందించిన కోర్టు రామ్‌గోపాల్‌వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మిర్యాలగూడ పోలీస్‌స్టేషన్‌లో వర్మతోపాటు నిర్మాత నట్టి కరుణపై కేసు నమోదు చేశారని నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు. అయితే సినిమా చిత్రీకరణ నిలిపివేయాలన్న పిటిషన్‌ మాత్రం కోర్టు నిరాకరించింది.

ఇవీ చూడండి: కంటోన్మెంట్​లోనూ ప్రభుత్వ పథకాల అమలు: తలసాని, మల్లారెడ్డి

Last Updated : Jul 4, 2020, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details