ఆస్ట్రేలియాలో తెలంగాణ యువతి దుర్మరణం - Australia latest news
08:37 January 02
ఆస్ట్రేలియాలో తెలంగాణ యువతి దుర్మరణం
ఆస్ట్రేలియాలో నాగర్‌కర్నూల్ జిల్లా యువతి మృతి చెందింది. వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన రక్షిత(22)ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. డిసెంబర్ 31న ఉదయం స్కూటీపై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు బ్రెయిన్‌డెడ్ అని తెలిపారు.
రక్షిత ఆస్ట్రేలియాలో ఎంఎస్ చదువుతున్నది. యువతి తండ్రి వెంకట్‌రెడ్డి విశ్రాంత ఆర్మీ ఉద్యోగి. తల్లి అనిత. హైదరాబాద్‌లోని మీర్‌పేటలో నివాసం ఉంటున్నారు. రక్షిత అవయవాలను దానం చేస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులు ప్రకటించారు. గత ఏడాది నవంబర్ 19న ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లిన రక్షిత.. ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.