ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొమిరేపల్లిలో.. మూర్ఛతో ఏసుపాదం అనే కౌలురైతు మృతి చెందాడు. పొలంలోని కాలువలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మూడు రోజులుగా.. గ్రామస్థులు వింత వ్యాధితో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఏపీ: కొమిరేపల్లిలో కలకలం.. మూర్ఛతో కౌలు రైతు మృతి - mysterious disease in komarepally at west godavari
ఇప్పటికే మూడు రోజులుగా గ్రామస్థులంతా అస్పస్థతకు గురవుతున్నారు. ఆ వ్యాధేమిటో వైద్యులకు అంతుచిక్కగా తలలుపట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ కౌలురైతు మూర్ఛతో చనిపోవటం ఆ గ్రామస్థులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
![ఏపీ: కొమిరేపల్లిలో కలకలం.. మూర్ఛతో కౌలు రైతు మృతి farmer died in komirepally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10360169-800-10360169-1611471803928.jpg)
farmer died in komirepally
కొమిరేపల్లిలో కలకలం.. మూర్ఛతో కౌలు రైతు మృతి
బాధితుల కోసం అధికారులు వైద్య శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో.. ఏసుపాదం మృతి చెందిన తీరు స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది.