ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చిన పోలీసులు... మృతుడి భార్య లక్ష్మీ, అతని అన్నయ్యతోపాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. గత నెల 26న ముళ్లపొదల్లో సీతారామాంజనేయులు అనే వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించగా... అతడి గొంతు నులిమి.. కొట్టిచంపినట్లు పోలీసులు తాజాగా తేల్చారు.
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించబోయారు.. పోలీసులకు చిక్కారు - guntur district crime news
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నవులూరులో జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. చెట్టు కొమ్మకు మృతదేహం వేలాడుతూ కన్పించేలా నిందితులు విఫలయత్నం చేసి దొరికిపోయారు.

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించబోయారు.. పోలీసులకు చిక్కారు
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించబోయారు.. పోలీసులకు చిక్కారు
చెట్టు కొమ్మకు మృతదేహం వేలాడుతూ కన్పించేలా నిందితులు విఫలయత్నం చేసి పోలీసులకు దొరికిపోయారు. మరదలితో వివాహేతర సంబంధం నేపథ్యంలో తమ్ముడిని హత్య చేసేందుకు దుర్గాప్రసన్న మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. ఈ కేసులో మరో నిందితుడు నాగరాజు గత నెల 18న గుంటూరు ఆర్టీవో కార్యాలయం సమీపంలో జరిగిన హత్య కేసులో నిందితుడని పోలీసులు గుర్తించారు.