తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వ్యక్తిని హత్య చేసి ముఖాన్ని పెట్రోల్​ పోసి కాల్చేశారు.! - నిజామాబాద్‌ జిల్లా తాజా వార్తలు

నిజామాబాద్‌ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. నైలాన్‌ తాడుతో బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు తెలుస్తోంది. ముఖాన్ని గుర్తుపట్టకుండా హంతకులు తగులబెట్టారు.

Murder of an unidentified man in Nizamabad district vempally44 national highway
గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి ముఖాన్ని కాల్చేశారు

By

Published : Jan 31, 2021, 1:34 PM IST

నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం వేంపల్లి శివార్లలో 44వ నంబర్‌ జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. రాత్రి సమయంలో హంతకులు ఈ హత్య చేసి ఉంటారని ఘటనా స్థలాన్ని బట్టి చూస్తే తెలుస్తోంది.

40 ఏళ్లకు పైగా ఉన్న వ్యక్తిని.. మొదట గొంతుకు నైలాన్‌ తాడుతో బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని రహదారిపై నుంచి కిందికి తోసి ముఖాన్ని గుర్తుపట్టకుండా పెట్రోలు పోసి తగులబెట్టారు. ముఖ భాగం కాలిపోయి.. గుర్తుపట్టలేకుండా ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చూడండి:విషం తాగి హోంగార్డు ఆత్మహత్య.. కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details