కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రోళ్ల స్వామిగౌడ్(38) హత్యకు గురై శవంగా కనిపించాడు. ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది.
ముత్యంపేటలో హత్య... భయాందోళనలో గ్రామస్థులు - kamareddy latest news
ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తర్వాతి రోజు మామిడితోటలో శవమై తేలిన ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేటలో చోటుచేసుకుంది. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
murder in domakonda mutyampet village
బుధవారం ఇంటి నుంచి బయల్దేరి వెళ్లిన స్వామిగౌడ్... ఈరోజు గ్రామ శివారులోని లేత మామిళ్ల తోటలో శవమై కనిపించాడు. సమాచారమందుకున్న కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.