సూర్యాపేట జిల్లాలో దారుణ హత్య జరిగింది. అనంతగిరి మండలంలోని శాంతినగర్-అనంతగిరి రహదారి పక్కన ఖమ్మం జిల్లాకు చెందిన వెనిశెట్టి రంగనాథ్(44) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో మోది హత్య చేశారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.
గ్రానైట్ వ్యాపారి దారుణ హత్య.. పక్కనే ఓ మహిళ! - ఖమ్మం జిల్లా గ్రానైట్ వ్యాపారి సూర్యాపేట జిల్లాలో హత్య
సూర్యాపేట జిల్లాలో ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన సమయంలో ఓ మహిళ అతనితో ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
రహదారి పక్కన గ్రానైట్ వ్యాపారి దారుణ హత్య
మృతుడు గ్రానైట్ వ్యాపారిగా పోలీసులు నిర్ధరించారు. ఆదివారం రాత్రి నేలకొండపల్లికి చెందిన ఓ మహిళతో ఉన్న రంగనాథ్‌ను దుండగులు బండరాళ్లతో మోది హత్య చేశారు. ఘటన సమయంలో ఆ మహిళ అతనితోనే ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ఆ మహిళ ఎవరు, హత్యకు గల కారణాలు, వివాహేతర సంబంధం... ఇలా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఎన్నికల ప్రచారంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి నిరసన సెగ