మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధి సురారం పాండు బస్తీలో ఈనెల 23న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మహారాష్ట్రకు చెందిన కాశిబాయి, మాధవ్ రెండేళ్ల క్రితమే వివాహం చేసుకున్నారు. లాక్డౌన్కి ముందు నగరానికి వచ్చి కాశిబాయి తన తల్లి వద్ద ఉండిపోవటం వల్ల మాధవ్ ఒక్కడే మహారాష్ట్రకు వెళ్ళాడు.
'భార్యను హత్య చేసి పరారైన భర్త' కేసును ఛేదించిన పోలీసులు
అనుమానంతో భార్యను హతమార్చి పరారైన భర్త కేసును పోలీసులు ఛేధించారు. ఈ నెల 23న హత్య జరగ్గా పోలీసులు ముమ్మర దర్యాప్తు జరిపి నిందితున్ని అరెస్టు చేసి... రిమాండ్కు తరలించారు.
'భార్యను హత్య చేసి పరారైన భర్త' కేసును ఛేదించిన పోలీసులు
ఈ క్రమంలో కాశిబాయి వివాహేతర సంబంధం ఏర్పరచుకుందనే అనుమానంతో మాధవ్.. ఈనెల 21న నగరానికి వచ్చాడు. 23న మహారాష్ట్రకు వెళ్లిపోదామని మాధవ్ చెప్పగా... భార్య నిరాకరించింది. ఇద్దరి మధ్య మాటామాట పెరగ్గా... భార్యను కత్తితో హతమార్చి పరారయ్యాడు. తనతో పాటు కాశిబాయి చిన్న తమ్ముడు దత్తుని తీసుకెళ్లాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు... నిందితుడు మాధవ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.