తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కులపెద్దగా తప్పించాలనే హత్య చేశారు: డీసీపీ నారాయణ రెడ్డి

తమ కుటుంబసభ్యుడిని ఎలాగైనా కులపెద్దని చేయాలని.. పెళ్లిలో అకారణంగా గొడవ పెట్టుకుని ఒకరిని హత్య చేసిన ఘటన మోత్కురు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు ఛేదించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

murder-case-chased-by-police-in-mothkur-mandal-at-yadadri-bhuvanagiri-district
కులపెద్దగా తప్పించాలనే హత్య చేశారు: డీసీపీ నారాయణ రెడ్డి

By

Published : Dec 3, 2020, 6:16 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామంలో ఈనెల 1వ తేదీన పెళ్లి వేడుకలో గొడవ కారణంగా జరిగిన హత్యను ఛేదించినట్లు డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన సూరారం చంద్రయ్య గ్రామంలో కుల పెద్దగా వ్యవహరిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన సూరారం వెంకటయ్యను ఎలాగైనా కుల పెద్దగా చేయాలని... వెంకటయ్య కుటుంబసభ్యులు సంవత్సరం నుంచి చంద్రయ్యతో గొడవలు పెట్టుకుంటున్నారు.

కావాలనే గొడవ పెట్టుకుని...

చంద్రయ్యను ఎలాగైనా తప్పించాలని వెంకటయ్య కుటుంబ సభ్యులు పథకం వేశారు. ఈనెల 1న అదే గ్రామానికి చెందిన తాటిపాముల మహేష్ వివాహ విషయంలో... పెళ్లికూతురు బంధువులు మర్యాద సరిగా చేయలేదని చంద్రయ్యతో గొడవపడ్డారు. అనంతరం చంద్రయ్యను ఇంటి లోపలికి తీసుకెళ్లి గొడ్డలితో దాడి చేశారు. అడ్డుకోబోయిన కొడుకు పరశురాములు, కుటుంబ సభ్యులపై సైతం వారు దాడికి దిగారు.

ముగ్గురు నిందితులు చిక్కారు...

స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీవ్రగాయాలైన పరశురాములు మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు డీసీపీ తెలిపారు. మిగతా వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు తరలించినట్లు పేర్కొన్నారు. మోత్కూరు మండలం దత్తప్పగూడెం దారిలో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారని... వారిని రిమాండ్​కు తరలించామని డీసీపీ వెల్లడించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని... త్వరలోనే వారిని సైతం పట్టుకుంటామని తెలిపారు.

కులపెద్దగా తప్పించాలనే హత్య చేశారు: డీసీపీ నారాయణ రెడ్డి

ఇదీ చూడండి:పెళ్లిలో మాంసం పెట్టలేదని గొడ్డలితో హత్య

ABOUT THE AUTHOR

...view details