ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం గట్టుకిందపల్లిలో దారుణం చోటు చేసుకుంది. వారం రోజుల్లో పెళ్లి కావాల్సిన యువతిపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారని యువతి తండ్రి ఆరోపించారు. వరండాలో నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్‌పోసి నిప్పంటించారని వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన యువతిని కుటుంబసభ్యులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు! - murder attempted on a young woman
మరో వారం రోజుల్లో ఆ యువతి పెళ్లి. ఇంతలోనే దారుణం జరిగింది. ఇంటి వరండాలో నిద్రిస్తున్న యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారని తండ్రి ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఇది ప్రమాదమా? లేక నిజంగానే ఎవరైనా హత్యాయత్నం చేశారా?
యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన దుండగులు
ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలంలో శునకాలు, కోళ్లు మంటల్లో చనిపోయి ఉండటంతో... అగ్నిప్రమాదం జరిగి ఉంటుందన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి మరో వారం రోజుల్లో వివాహం జరగనుండగా.. ఈ ఘటన జరగటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి:మరో ప్రాణం తీసిన ఆన్‌లైన్ అప్పు