తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మార్కెట్‌యార్డు ఛైర్మన్ కుమారుడిపై హత్యాయత్నం - మచిలీపట్నం వార్తలు

ఏపీలోని మచిలీపట్నం మార్కెట్‌యార్డు ఛైర్మన్‌, వైకాపా నేత అచ్చాబా కుమారుడు ఖాదర్‌ బాషాపై హత్యాయత్నం జరిగింది. ఒంటిపై కిరోసిన్‌ పోసి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఖాదర్‌ బాషాకు 40శాతానికి పైగా గాయాలయ్యాయి.

Murder attempt
వైకాపా నేత కుమారుడిపై హత్యాయత్నం

By

Published : Oct 30, 2020, 3:21 PM IST

ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. మార్కెట్‌యార్డు ఛైర్మన్‌, వైకాపా నేత అచ్చాబా కుమారుడు ఖాదర్‌ బాషాపై హత్యాయత్నం జరిగింది. ఖాదర్‌ బాషా ఇంట్లో ఉన్న సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఖాదర్‌ బాషాకు 40శాతానికి పైగా గాయాలయ్యాయి.

ప్రత్యర్థులు ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా లేక కుటుంబ కలహాల నేపథ్యంలో ఘటన జరిగిందా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడిని చికిత్స కోసం పోలీసులు విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఖాదర్‌బాషా భార్యపై అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:ఇద్దరు పిల్లలతో వివాహిత అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details