హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. ఆటోను నిర్లక్ష్యంగా నడుపుతూ రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన పర్వేజ్‌ను ప్రశ్నించిన అర్షద్‌పై దాడికి పాల్పడ్డాడు.
యువకుల మధ్య తగాదా.. కత్తితో దాడి - పాతబస్తీలో యువకుడిపై కత్తితో దాడి
నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వ్యక్తిని ప్రశ్నించిన వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన పాతబస్తీలో జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనాన్ని ఆటోతో ఢీకొట్టిన పర్వేజ్‌ను ప్రశ్నించిన అర్షద్‌పై కత్తితో దాడి చేశాడు. ఘటనలో బాధితుడికి గాయాలయ్యాయి.
యువకుల మధ్య తగాదా.. కత్తితో దాడి
తాళ్లకుంట ప్రాంతంలో ఓ దుకాణం ముందు నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని పర్వేజ్... ఆటోతో ఢీకొట్టాడు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ద్విచక్రవాహన యజమాని అర్షద్... పర్వేజ్‌తో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. అర్షద్‌పై పర్వేజ్ కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన వారిని గాయపరిచాడు. సమాచారం అందుకున్న చంద్రాయణగుట్ట పోలీసులు పర్వేజ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:అక్రమంగా రుణాలు తీసుకున్నారని ఆందోళన