జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన గంగాజలను భర్త గోపాల్ హత్య చేసి పరారయ్యాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గోపాల్‌తో గంగాజలకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. భార్య స్వగ్రామమైన పైడిమడుగులోనే కొంతకాలంగా కుటుంబంతో కలిసి గోపాల్ ఉంటున్నాడు.
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం! - murder at jagtial and An attempt to portray murder as suicide
భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నిత్యం మద్యం సేవిస్తూ.. గొడవపడే వాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తెల్లవారుజామున భార్యను హత్యచేసి పరారయ్యాడని ఆరోపించారు.

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం!
ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉంటూ.. నిత్యం మద్యం తాగుతూ గొడవపడే వాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తెల్లవారుజామున గంగాజలను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడన్నారు. గోపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
ఇదీ చూడండి:బోరు మోటర్తో విద్యుదాఘాతం.. యువకుడు మృతి