కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గుడితండాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే.. భార్యను గొంతు నులిమి చంపేశాడు.
గుడితండాకు చెందిన శిరీషకు మొదట మండలంలోని గౌరారానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి జరిగింది. వారిరువురి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడం వల్ల 6 నెలల్లోనే పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శిరీష తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోవడం వల్ల.. శిరీష తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి గుడితండాలోనే ఉంటోంది.
ఈ క్రమంలో పిట్లంకు చెందిన శ్రీకాంత్తో శిరీషకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారటంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్కు వెళ్లి జీవిస్తున్నారు. 15 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి తిరిగొచ్చారు. శిరీష పుట్టింటికి వెళ్లగా.. శ్రీకాంత్ పిట్లంలోని తన ఇంటికి వెళ్లాడు.