బీమా సొమ్ము కోసం ముంజల సైదులు అనే వ్యక్తిని సొంత అన్న కుమారుడే హత్య చేసిన ఘటన అప్పట్లో సంచలనమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయికి చెందిన ముంజల రమేశ్ ఇటీవలే జైలు నుంచి ఇంటికి వచ్చాడు.
పైసల కోసం బాబాయినే చంపేశాడు.. అతనూ చనిపోయాడు! - saidulu murderculprit died of suicide in suryapet
బీమా కోసం సొంత బాబాయినే హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లిన ముంజల రమేశ్ ఇటీవలే బయటకు వచ్చాడు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయిలో ఈనెల 2న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బీమా కోసం బాబాయిని చంపిన నిందితుడి ఆత్మహత్య
ఈనెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో రమేశ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని వెల్లడించారు.
ఇదీ చూడండి:తీరంవైపు కదులుతున్న 'నిసర్గ'-రాష్ట్రాలు అప్రమత్తం
TAGGED:
సూర్యాపేటలో వ్యక్తి ఆత్మహత్య