భైంసాలో మహిళపై మున్సిపల్ వైస్‌ఛైర్మన్ దాడి - nirmal crime news

18:44 October 06
భైంసాలో మహిళపై మున్సిపల్ వైస్‌ఛైర్మన్ దాడి
నిర్మల్ జిల్లా భైంసాలో ఓ భూవివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. భైంసా-మంజ్రీ మధ్యలో ఉన్న 15 ఎకరాల స్థలవివాదం కోర్టులో ఉంది. ఈ భూమిని మున్సిపల్ వైస్‌ఛైర్మన్ జాబీర్ హైమద్, తనయుడు అమీర్ హైమద్ ట్రాక్టర్‌తో చదువు చేస్తుండగా.. అందులో తన భూమి ఉందని స్థానిక మహిళ దేవుబాయి అడ్డుకోబోయింది.
ఇరువురి మధ్య వాగ్వాదం.. ఘర్షణకు దారితీసింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో సదరు మహిళ రోడ్డుపై పడిపోయింది. పురపాలక వైస్ ఛైర్మన్, అతని తనయుడు అమీర్ హైమద్.. రాళ్లతో దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. తమపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని సదరు మహిళ పోలీసులను కోరారు.
ఇవీచూడండి:సినిమా కథను మించిన థ్రిల్లర్ స్టోరీ... నేపాల్ గ్యాంగ్ చోరీల మిస్టరీ