మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి స్టేజీ సమీపంలో ఇసుక ట్రాక్టర్, ద్విచక్రవాహనాన్ని ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
మహబూబాబాద్‌లో రోడ్డు ప్రమాదం... ఉదారత చాటుకున్న ఎంపీ కవిత - mahaboobabad dist updates
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. అదే మార్గంలో హైదరాబాద్ వస్తున్న ఎంపీ కవిత మానవత్వాన్ని చాటుకున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
మహబూబాబాద్‌లో రోడ్డు ప్రమాదం... ఉదారత చాటుకున్న ఎంపీ కవిత
అదేమార్గంలో హైదరాబాద్ వస్తున్న ఎంపీ కవిత గాయపడిన వ్యక్తిని తన వాహనంలో ఆస్పత్రికి తరలించి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.దంతాలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న మురళి తన బంధువుతో కలిసి శనిగపురం వెళ్తుండగా ఘటన జరిగింది. తీవ్ర గాయాలైన మురళిని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.