ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని నరపాం గ్రామానికి చెందిన గౌరీ అనే వివాహిత తన ఇద్దరు ఆడపిల్లలతో ఆత్మహత్యకు పాల్పడింది. ఊరికి సమీపంలో ఉన్న చెరువులో పడి ఈ అఘాయిత్యం చేసుకుంది. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని ఆమె భర్త తెలిపారు.
ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడిన తల్లి - కొత్తవలస మండలం తాజావార్తలు
ఏ కష్టం వచ్చిందో తెలియదు.. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలనూ తనతోపాటే తీసుకెళ్లాలనుకుంది. తన ఇద్దరు పిల్లలతో ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని నరపాం గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడిన తల్లి
గౌరీ భర్త శ్రీను లారీ డ్రైవర్గా పని చేస్తున్నట్లు తెలిపాడు. సొంతూరు గజపతినగరం అనీ, అక్కడ నుంచి కొత్తవలస మండల తుమ్మికాపల్లి వలస వచ్చి నివాసం ఉంటున్నారని చెప్పారు. కొంతకాలంగా వారి మధ్య జరుగుతున్న గొడవల కారణంగా తమ ఇద్దరు పిల్లలు సంకీర్తన(7), హాసిని(6)లతో బలవర్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. అభం, శుభం తెలియని చిన్నారులు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: