తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చెరువులోపడి తల్లీ, ఇద్దరు కుమార్తెలు మృతి - నాగర్​కర్నూలులో చెరువులోపడి తల్లీ ఇద్దరు కుమార్తెలు మృతి

చెరువులోపడి తల్లీ ఇద్దరు కుమార్తెలు మృతి
చెరువులోపడి తల్లీ ఇద్దరు కుమార్తెలు మృతి

By

Published : Nov 19, 2020, 4:28 PM IST

Updated : Nov 19, 2020, 10:02 PM IST

16:27 November 19

చెరువులోపడి తల్లీ, ఇద్దరు కుమార్తెలు మృతి

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న అమృత... వట్టెంలోని పుట్టింట్లో ఉంటోంది. ఆరేళ్ల క్రితం అమృతను పుల్లగిరికి చెందిన రాజుతో వివాహం చేయగా... మనస్పర్ధల కారణంగా భర్తతో దూరంగా నివసిస్తోందని గ్రామస్థులు తెలిపారు.

ఇవాళ సాయంత్రం పెద్దచెరువులో తల్లికుమార్తెల మృతదేహాలు కనిపించాయనే సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్థులు.... మృతదేహాలను వెలికితీశారు. అప్పటిదాకా తమ కళ్లముందే ఆడుతూ పడుతూ కనిపించిన చిన్నారులు... విగతజీవులుగా మారగా కుటుంబసభ్యులు గుండెలవిలసేలా రోదించారు. ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి:పెళ్లితో ఒక్కటి కాలేక.. చావులో ఒక్కటయ్యారు!

Last Updated : Nov 19, 2020, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details