ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామంలో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మద్యానికి బానిసైన భర్త వేధింపులు తాళలేక పిల్లలతో కలిసి బలవన్మరణానికి యత్నించింది. పత్తికొండ మండలం చిన్నహుల్తికి చెందిన ధర్మరాజు కొన్ని రోజులుగా మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. బుధవారం రాత్రి భార్యతో ఘర్షణ పడ్డాడు. మనస్థాపానికి గురైన భార్య.. ఇద్దరు పిల్లలతో కలిసి పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న తల్లి, పిల్లలను స్థానికులు పత్తికొండ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇద్దరు పిల్లలతో పురుగుల మందు తాగించి తానూ... - mother suicide with children at karnool
మద్యానికి బానిసైన భర్త వేధింపులు తాళలేక.. ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ బలవన్మరణానికి యత్నించింది. ఇద్దరు పిల్లలతో కలిసి పురుగుల మందు తాగింది. స్థానికులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఏపీ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
విషాదం: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం