సూర్యాపేటలో దారుణం జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను సద్దలచెరువులోకి నెట్టేసింది. ఘటనలో కుమారుడి, కుమార్తె మృతదేహాలు లభ్యమయ్యాయి.
దారుణం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి - MOTHER KILLED HER CHILDREN

07:31 June 15
దారుణం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి
ఉదయం చెరువు వద్ద మహిళను గుర్తించి స్థానికులు ఆరాతీయగా.. విషయం వెలుగు చూసింది. థాయ్ ప్రశాంత్, నాగమణి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా ప్రశాంత్ మద్యానికి బానిసయ్యాడు. తరచూ కుటుంబంలో కలహాలు జరుగుతుండేవి.
ఈ నేపథ్యంలోనే రాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా... ఇద్దరు పిల్లలను వెంటపెట్టుకుని చెరువు దగ్గరికి వెళ్లిన నాగమణి... వారిని చెరువులోకి తోసేసింది. తానూ ఆత్మహత్య చేసుకుందామని చెరువులోకి దిగింది. కానీ ధైర్యం చాలక పోవడం వల్ల ప్రయత్నం ఉపసంహరించుకుంది.
తెల్లవారుజాము వరకు అక్కడే కూర్చొని విలపిస్తూ స్థానికుల కంటపడింది. మహిళ ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సుర్యాపేట పోలీసులు వెల్లడించారు.