మద్యం మత్తులో.. తన సొంత బిడ్డనే విక్రయించిన మహిళను హైదరాబాద్ హబీబ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక సుబాన్‌పురాకు చెందిన అబ్దుల్ జోయాఖాన్, ముజాహిద్ భార్యాభర్తలు. వీరికి షేక్ అద్నాన్ అని రెండు నెలల బాలుడు ఉన్నాడు. భర్త ఎర్రమంజిల్ కాలనీలోని ఓ బార్లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. దంపతులిద్దరూ మద్యం తాగి గొడవపడేవారని ఏసీపీ నరేందర్‌రెడ్డి తెలిపారు.
మద్యం మత్తులో కన్న కొడుకునే అమ్మేసిన కసాయి తల్లి! - మద్యం మత్తులో కన్న కొడుకునే అమ్మేసిన కసాయి తల్లి!
హైదరాబాద్ హబీబ్‌నగర్ పీఎస్ పరిధిలో మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ రూ. 45 వేలకు ఓ మధ్యవర్తి ద్వారా తన కుమారుడిని విక్రయించగా.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు మరో ఐదుగురిని రిమాండ్‌లోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మద్యం మత్తులో కన్న కొడుకునే అమ్మేసిన కసాయి తల్లి!
భార్యతో గొడవపడ్డ ముజాహిద్.. ఆగస్టు 3న ఇంటి నుంచి వెళ్లిపోయి 8న తిరిగొచ్చాడు. ఇంట్లో తన రెండు నెలల బాబు కనిపించకపోగా అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులకు కాలాపత్తర్‌కు చెందిన సిరాజ్ అనే మహిళకు రూ. 45 వేలకు బాలుడిని విక్రయించినట్లు తమ దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు.
ఇదీ చదవండి:'కోజికోడ్ విమానాశ్రయ రన్‌వే సురక్షితమైనదే'