తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భార్యాభర్తల గొడవ.. బిడ్డను అమ్మేసిన తల్లి - భార్యాభర్తల గొడవ.. బిడ్డను అమ్మేసిన తల్లి

భార్యాభర్తలు గొడవపడ్డారు. కోపంలో భర్త బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే తమ 2 నెలల పసికందును అమ్మేసింది ఓ కసాయి తల్లి. భర్త తిరిగొచ్చి బిడ్డ గురించి ఆరా తీయగా.. అసలు బాగోతం బయటపడింది. అసలు ఏం జరిగిందంటే..

mother saled her baby at habib nagar ps limits
భార్యాభర్తల గొడవ.. బిడ్డను అమ్మేసిన తల్లి

By

Published : Aug 11, 2020, 8:59 PM IST

హైదరాబాద్‌ హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అబ్దుల్‌ జోహార్‌ఖాన్, అబ్దుల్‌ ముజాహిద్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండు నెలల ఓ బిడ్డ ఉంది. అయితే ఈనెల 3న దంపతులిద్దరూ గొడవపడ్డారు. అనంతరం భర్త.. తమ బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు.

ఈ క్రమంలో జోహార్‌ ఖాన్‌ తన రెండు నెలల బిడ్డను అమ్మేసింది. కాలా పత్తర్‌లోని ఓ కుటుంబానికి రూ.45 వేలకు విక్రయించింది. 8న ఇంటికి తిరిగొచ్చిన భర్త.. బిడ్డ గురించి ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ముజాహిద్‌ పోలీసులను ఆశ్రయించగా.. బిడ్డను సురక్షితంగా తండ్రికి అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి: 'అక్రమంగా తయారు చేసిన శానిటైజరే వారి ప్రాణాలు తీసింది'

ABOUT THE AUTHOR

...view details