తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రెండు వేలకోసం తల్లిని హతమార్చిన తనయుడు - kamareddy crime news

రెండు వేల రూపాయలు ఇవ్వలేదని తల్లిని హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లా ధర్మారెడ్డి గ్రామంలో జరిగింది. మద్యం మత్తులో కొడవలితో దాడి చేసి హత్యచేశాడు తనయుడు.

mother murdered in kamareddy
రెండు వేలకోసం తల్లిని హతమార్చిన తనయుడు

By

Published : Dec 1, 2020, 5:04 AM IST

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో దారుణం జరిగింది. డబ్బులు ఇవ్వలేదని తల్లిని హతమార్చాడు. ధర్మారెడ్డి గ్రామానికి చెందిన ఎల్లయ్య.. భార్యను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం తల్లి కమలవ్వ దగ్గరికి వచ్చాడు. అప్పటి నుంచి రెండు వేల రూపాయలు ఇవ్వాలంటూ వేధించసాగాడు.

సోమవారం సాయంత్రం నాగిరెడ్డిపేటలోని సంతను ముగించుకొని తల్లి ఇంటికి వచ్చింది. వంట చేస్తుండగా.. మద్యం మత్తులో ఉన్న ఎల్లయ్య కొడవలితో తల్లి మెడపై దాడిచేశాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని..నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ఇవీచూడండి:తాగుడుకు బానిసై...మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త

ABOUT THE AUTHOR

...view details