తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కూర బాగా వండలేదని తల్లి గొంతు కోసిన కొడుకు - latest crime news in medak

రుచికరమైన కూరలు వండటం లేదని, సరిగా అన్నం పెట్టడం లేదని కోపంతో ఓ కొడుకు కన్న తల్లి గొంతు కోసిన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నర్సింగ్ గ్రామంలో జరిగింది. నిందితుడిని అరెస్టు చేసిని పోలీసులు జోగిపేట మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

mother murder by son in medak distirct
కూర బాగోలేదని తల్లి గొంతు కోసిన కొడుకు

By

Published : Sep 6, 2020, 2:40 PM IST

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నర్సింగ్ గ్రామానికి చెందిన శ్రీరామ్ భాగమ్మకు కొన్నేళ్లక్రితం హనుమంతు అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో భర్త మృతి చెందాడు. ఆ తర్వాత ఆమెకు పుట్టిన కుమారుడిని ఎన్నో కష్టాలు పడుతూ అల్లారుముద్దుగా పెంచింది. కూలి పని చేస్తూ, వచ్చిన పింఛన్​తో జీవనం సాగిస్తున్నారు.

కొడుకు కోటేశ్​(19) చదువు మానేసి ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. గురువారం సాయంత్రం బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన కొడుకు వండిన కూర నచ్చకపోవడంతో కోపంతో ఊగిపోయాడు. అక్కడే ఉన్న కత్తితో తల్లి గొంతు కోశాడు. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వారు వచ్చేసరికి కోటేశ్​ పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న భాగమ్మను హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్​లోని బీరంగూడలో నిందితుడు కోటేశ్​ పట్టుకున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు చేర్చే రహదారి సిద్ధం!

ABOUT THE AUTHOR

...view details