తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పురుగుమందు తాగి ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం - తెలంగాణ వార్తలు

తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ సేవించి ఓ తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నాగర్​కర్నూల్​ జిల్లాలోని గట్టు నెల్లికుదురు గ్రామంలో చోటుచేసుకుంది. పిల్లలు ప్రాణాలతో బయటపడగా... తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

పురుగుమందు తాగి ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం
పురుగుమందు తాగి ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం

By

Published : Jan 2, 2021, 1:30 AM IST

ఆర్థిక ఇబ్బందులతో భార్యభర్తలు ఘర్షణ పడ్డారు. ఈ గొడవ నేపథ్యంలో మనస్తాపానికి గురైన తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ సేవించింది. ఈ ఘటన నాగర్​కర్నూల్​ జిల్లా తెలకపల్లి మండలం గట్టు నెల్లికుదురు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, భర్త అందించిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని గట్టు నెల్లికుదురు గ్రామానికి చెందిన మల్లేష్, మాధవి దంపతులు పుట్టింటి నుంచి రావలసిన 20 వేల రూపాయల విషయంలో మల్లేష్ భార్యతో శుక్రవారం గొడవ పడ్డారు.

మనస్తాపానికి గురైన మాధవి ఇంటి దగ్గర ఎవరూ లేని సమయంలో తన 2 సంవత్సరాల కుమారుడు నందుకు, 6 నెలల పాప మమతకు పురుగుల మందు ఇచ్చి తానూ సేవించింది.ఇది గమనించిన కుటుంబ సభ్యులు స్థానికులు వెంటనే వారిని 108 వాహనంలో నాగర్​కర్నూల్ జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారు. తల్లి మాధవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:కొడుకును చంపేందుకు తల్లి సుపారీ.. ఉరేసి.. బావిలో పడిసి!

For All Latest Updates

TAGGED:

crime news

ABOUT THE AUTHOR

...view details