ఓ పరిశ్రమలో పనిచేసే కాంట్రాక్టు కార్మికుడు విధులకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు అదృశ్యమైన ఘటన సంగారెడ్డి పటాన్చెరులో చోటుచేసుకుంది. బిహార్లోని యిజ్పూర్ జిల్లా కిష్వన్ గ్రామానికి చెందిన ప్రభాకర్... పటాన్చెరు పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. తన భార్య రాణి దేవి, కుమారుడు సమీర్తో కలిసి గోకుల్ నగర్లో నివాసం ఉంటున్నాడు.
విధులకు వెళ్లి వచ్చేసరికి భార్య, కుమారుడు అదృశ్యం - patancheru news
విధులకు వెళ్లి వచ్చి చూసేసరికి ఇంట్లో భార్య , కుమారుడు కన్పించలేదు. చుట్టుపక్కల చూశాడు... తెలిసిన వాళ్లింటికి వెళ్లారేమో ఆరా తీశాడు. తనకు తెలిసిన అన్ని చోట్లా వెతికాడు. అయిన ఆచూకీ లేదు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగింది.
![విధులకు వెళ్లి వచ్చేసరికి భార్య, కుమారుడు అదృశ్యం mother and son missing in patancheru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8598587-789-8598587-1598662514813.jpg)
mother and son missing in patancheru
ఈనెల 26న పరిశ్రమలో విధులకు వెళ్లిన ప్రభాకర్... సాయంత్రం ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు కనిపించలేదు. చుట్టుపక్కల, తెలిసిన చోట్లలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఇక చేసేదేమిలేక పటాన్చెరు ఠాణాలో ప్రభాకర్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.