తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తల్లీకొడుకుల అదృశ్యం... తండ్రి మందలింపే కారణమా? - telangana varthalu

తల్లీ కొడుకులు అదృశ్యమయ్యారు. ఉద్యోగం రావడం లేదని తండ్రి మందలించాడని, అందుకే వారు ఇంట్లోనుంచి వెళ్లిపోయారని సమాచారం.

తల్లి కొడుకులు అదృశ్యం... తండ్రి మందలింపే కారణమా?
తల్లి కొడుకులు అదృశ్యం... తండ్రి మందలింపే కారణమా?

By

Published : Jan 28, 2021, 4:15 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో తల్లీ కొడుకులు అదృశ్యమయ్యారు. జిల్లా కేంద్రంలోని వాసవీనగర్ కాలనీకి చెందిన లింగ మల్లీశ్వరి(50), ఆమె కొడుకు భానుచందర్(27) ఈనెల 26న మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. రెండు రోజులైనా తిరిగి రాకపోయేసరికి మల్లీశ్వరి భర్త గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొడుకు భానుచందర్​కు ఉద్యోగం లేకపోయేసరికి తండ్రి మందలించినట్టుగా తెలుస్తోంది. దాంతో ఈ నెల 26న ఆయన ఇంట్లో లేని సమయంలో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నామని సీఐ మధుసూదన్ తెలిపారు.

ఇదీ చదవండి: వాహన తనిఖీలు: 105కేజీల వెండి స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details