తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కిరాణ దుకాణానికి వెళ్లిన తల్లి, కుమారుడు అదృశ్యం - Mother and son missing news

తల్లి, కుమారుడు అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Mother Son Missing
Mother Son Missing

By

Published : Oct 16, 2020, 10:08 PM IST

కిరాణ దుకాణానికి వెళ్లిన తల్లి, కుమారుడు కనిపించకుండా పోయిన ఘటన చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ మెట్టుగూడకు చెందిన అలేఖ్య సాండ్రా, రెండేళ్ల కుమారుడు శివన్ష్‌... ఈనెల 15న రాత్రి సమయంలో కిరాణ దుకాణానికి వెళ్లి వస్తామని చెప్పి బయటికి వెళ్లిపోయారు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబసభ్యులు ఆ ప్రాంతమంతా గాలించారు.

అనుమానం వచ్చిన బంధువులు, స్నేహితుల ఇంట్లో గాలించినా ఫలితం లేకపోయింది. వెంటనే చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెట్టుగూడలో ఉంటున్న ఓ ఆటో డ్రైవర్‌తో అతిగా పరిచయం ఉందని అతనితో వెళ్లి ఉండవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆటో నెంబరు పరిశీలించేందుకు పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇంత వరకు తల్లి కుమారుడు ఆచూకీ తెలియరాలేదని పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి:రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసిన గవర్నర్

ABOUT THE AUTHOR

...view details