రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలో ఉదయం తల్లి, కుమారుడు అపహరణకు గురయ్యారు. ఇద్దరినీ గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం తర్వాత చేవెళ్లలో వదిలేసి వెళ్లిపోయారు.
అసలేం జరిగింది... సినీ ఫక్కీలో తల్లి, కుమారుడి కిడ్నాప్! - రంగారెడ్డి జిల్లా వార్తలు

20:00 July 08
అసలేం జరిగింది... సినీ ఫక్కీలో తల్లి, కుమారుడి కిడ్నాప్!
అసలేం జరిగిందంటే... బండ్లగూడ మున్సిపాలిటీలోని గంధంగూడకు చెందిన ఆదిలక్ష్మి నాంపల్లి కోర్టులో పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. దగ్గర్లోని అభయ ఆంజనేయ దేవాలయానికి తరచూ వెళుతుంది. రోజులాగే బుధవారం ఉదయమే కొడుకు ప్రజ్వన్‌ను తీసుకుని దేవాలయానికి వెళ్లింది. ప్రదక్షిణలు చేస్తూనే.. మధ్యలోని బయటికి వెళ్లింది.
అంతలోనే గుర్తుతెలియని వ్యక్తులు ఎక్స్‌యూవీ 500 బ్లాక్ కలర్ కారులో వచ్చి వారిని ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం తర్వాత చేవెళ్లలో వదిలేసి వెళ్లిపోయారు. ఎట్టకేలకు తల్లి, కుమారుడు సురక్షితంగా ఇంటికి చేరారు. వీరిని కిడ్నాప్ చేసిందెవరు.. ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు... అసలేం జరిగింది? అనేది తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి :ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ స్ఫూర్తిగా నూతన సచివాలయం