అంతు చిక్కని సమస్యతో.. ఏలూరు ప్రభుత్వాసుత్రిలో చేరుతున్న రోగుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. అస్వస్థతతో వరుసగా మూడో రోజూ పెద్ద సంఖ్యలో బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నారు. మూర్చ, తలతిరగడం, నోట్లో నుంచి నురగ రావడం వంటి లక్షణాలతో ఇప్పటి వరకు 344 మంది చేరారు.
ఏలూరులో పెరుగుతున్న బాధితులు.. మరో 27 మందికి అస్వస్థత - new members join in eluru hospital
ఏపీలోని ఏలూరులో అంతుచిక్కని సమస్యతో ప్రజలు ప్రభుత్వాసుపత్రిలో చేరుతున్నారు. అస్వస్థతతో ఆసుపత్రి పాలవుతున్న రోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దీనికి గల కారణాలు తెలుసుకోవడంలో రాష్ట్ర వైద్య బృందాలు నిమగ్నమయ్యాయి.
ఏలూరు కలవరం
చికిత్స నుంచి కోలుకుని 180 మంది డిశ్చార్జ్ అయ్యారు. పరిస్థితి విషమించి ఒకరు చనిపోయారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించినా.. అస్వస్థతకు కారణం ఏంటనేది ఇంకా అంతుబట్టడం లేదు. నిన్న రాత్రి నుంచి మరో 27 మంది రోగులు ఆస్పత్రిలో చేరారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితిని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.కె.సింఘాల్ సమీక్షిస్తున్నారు.