తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వాటర్​మేన్​పై వానర సైన్యం దాడి.. ఆసుపత్రికి తరలింపు - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

తుంగతుర్తి పట్టణంలో ఓ వ్యక్తిపై వానర సైన్యం దాడి చేసింది. ఘటనలో బాధితుడికి గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

Monkey attack on water man in Suryapeta district
వాటర్​మేన్​పై వానర సైన్యం దాడి.. ఆసుపత్రికి తరలింపు

By

Published : Sep 8, 2020, 8:47 AM IST

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పట్టణంలో గ్రామ పంచాయతీ వాటర్ మేన్​గా పనిచేస్తున్న జలగం సైదులు అనే వ్యక్తిపై కోతులు దాడి చేశాయి. ఎంపీపీ కార్యాలయంలో నీళ్లు ఇవ్వడానికి వెళ్లగా.. అక్కడే చెట్లపై ఉన్న వానర సైన్యం ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. ఘటనలో సైదులుకు గాయాలయ్యాయి. గుర్తించిన గ్రామస్థులు కోతులను తరిమికొట్టారు. సైదులును చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పట్టణంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి కోతుల బెడద లేకుండా చూడాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:28 వరకు శాసనసభ వర్షాకాల సమావేశాలు..ఈనెల 9న రెవెన్యూ బిల్లు

ABOUT THE AUTHOR

...view details