ETV Bharat / jagte-raho
లోక్సభ ఎన్నికల వేళ 15 కోట్లకు పైగా సొత్తు జప్తు - liquor and foreign currency
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు 15 కోట్లకు పైగా సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు లక్షా 30 వేల లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు.
ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న సొత్తు
By
Published : Mar 27, 2019, 10:48 AM IST
| Updated : Mar 27, 2019, 11:43 AM IST
ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న సొత్తు లోక్సభ ఎన్నికల వేళ ఇప్పటి వరకు అన్ని రూపాల్లో 15 కోట్లకు పైగా సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు పది కోట్ల 66 లక్షల నగదు, లక్షా 30 వేల లీటర్లకు పైగా మద్యాన్ని.. ఐటీ, అబ్కారీ అధికారులు పట్టుకున్నారు. ఈ లిక్కర్ విలువ రెండు కోట్ల 19 లక్షలకు పైగా ఉంది. రెండు కోట్ల 45 లక్షల కన్నా ఎక్కువ విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 543 గ్రాముల బంగారం, 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. Last Updated : Mar 27, 2019, 11:43 AM IST