తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

1.2 లక్షలు కడితే 25 లక్షలు.. ఎంపీకి మోసగాడి ఫోన్​ - money fraud call

'హలో... నేను కేంద్ర పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్​ మహేశ్​ను మాట్లాడుతున్నా. మేము నిరుద్యోగులకు లోన్లు ఇస్తున్నాం. మీ ఏరియాలోని ఓ 25 మంది నిరుద్యోగ యువకులు పేర్లు పంపించండి. వారందరికీ రూ.25 లక్షల రుణాలిస్తాం. మళ్లీ అందులోనూ 50 శాతం సబ్సిడీ కూడా ఉంటుంది. చాలా మంది ఎంపీలు పోటీలో ఉన్నా... మంత్రి కేటీఆర్​ చెప్పారు కాబట్టి మీకు ఫోన్​ చేశాం" అంటూ ఓ మోసగాడు ఏకంగా ఎంపీ కె. కేశవరావుకు కాల్​ చేసి బురిడీ కొట్టించబోయాడు.

money cheating cakll to mp keshavarao
money cheating cakll to mp keshavarao

By

Published : Aug 26, 2020, 12:30 PM IST

సామాన్యులనే కాదు ప్రజాప్రతినిధులను సైతం మోసగాళ్లు వదలడం లేదు. ఎంపీ కే కేశవరావుకు సోమవారం ఓ ఫోన్ కాల్ వచ్చింది. కేంద్ర పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్​గా మోసగాడు పరిచయం చేసుకున్నాడు. సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీంను కేంద్రం ప్రవేశపెట్టిందని, 25 మంది నిరుద్యోగులకు రూ.25 లక్షల చొప్పున రుణం ఇస్తోందని వివరించాడు. ఇందులో 50 శాతం సబ్సిడీ ఉంటుందని చెప్పాడు. ఎంతోమంది ఎంపీలు పోటీపడుతున్నా... మంత్రి కేటీఆర్ సిఫారసుతో మీకే మంజూరు చేయించాలని భావిస్తున్నామని నమ్మబలికాడు. నిరుద్యోగుల పేర్లు పంపితే రుణాలిస్తామన్నాడు.

ఈ విషయాన్ని కేకే.. తన కుమార్తె గద్వాల్ విజయలక్ష్మికి తెలిపారు. ఆమె.. మహేశ్​కు ఫోన్ చేయగా దరఖాస్తుకు ఈ రోజు చివరితేదీ అని, ఒక్కొక్కరికీ రూ.1.25 లక్షల దాకా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని... డీడీ కడితే చాలు దరఖాస్తు ఆన్​లైన్​లో అప్​లోడ్ చేస్తానన్నాడు. విజయలక్ష్మి తన డివిజన్​లో కొంతమంది నిరుద్యోగులకు పథకం గురించి వివరించారు.

అప్పటికే మధ్యాహ్నం మూడు కావటం వల్ల డీడీ కట్టే సమయం అయిపోగా... డబ్బు తన అకౌంట్​లో వేయాలని సూచించాడు. అప్పుడు అనుమానం వచ్చిన ఎంపీ కేకే.. మహేశ్ అనే వ్యక్తి కాల్ చేసి ఎక్కడున్నారని అడిగారు. తాను మంత్రి కేటీఆర్​తో ప్రగతిభవన్​లో ఉన్నట్టు సమాధానమిచ్చాడు. కేశవరావు నేరుగా కేటీఆర్​కు ఫోన్ చేయగా.. ఆయన దిల్లీలో ఉన్నట్టు కేటీఆర్​ పీఏ తెలిపాడు.

ఇది మోసమని గుర్తించిన కేకే... కుమార్తెను, ఇతరులను అప్రమత్తం చేశారు. అప్పటికే అఖిల్ అనే వ్యక్తి మోసగాడి ఖాతాలో రూ.50 వేలు ట్రాన్స్ఫర్ చేశాడు. బాధితుడు అఖిల్​తో సైబరాబాద్​ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. పోలీసులు అకౌంట్​ వివరాలు సేకరించగా... నిజామాబాద్​లోని ఓ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసినట్లు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details