పెళ్లి చేసుకుంటానని గణేశ్ అనే వ్యక్తి తనను నమ్మించి మోసం చేశాడంటూ ఏపీలోని చిత్తూరు జిల్లా పెద్దపంజాణి పోలీస్స్టేషన్లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఇంతకాలం సహజీవనం చేస్తూ.. మరొకరిని వివాహమాడాడని పేర్కొంది.
మూడు నెలలుగా సహజీవనం.. మరొకరితో వివాహం
ఆరేళ్లు ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. 3 నెలలుగా సహజీవనం చేశాడు. చివరికి మరొకరిని వివాహం చేసుకున్నాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలంటూ... పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గంగవరం మండలం మిట్టమీద కురప్పల్లికి చెందిన గణేశ్, పెద్దపంజాణి మండలానికి చెందిన ఈ యువతి.. గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పలమనేరులోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుకునే సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. రెండేళ్ల క్రితం ఇరువురూ బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని.. మూడు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. కరోనా సమయంలో లాక్డౌన్ కారణంగా గణేశ్ సొంత గ్రామానికి చేరుకున్నాడు. బాధితురాలు ఫోన్ చేస్తున్నా... ఇంతకుముందులా పట్టించుకోవడం లేదు. అసలేమైందని యువతి ఆరా తీయగా.. బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:'మదనపల్లెను జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమం ఆపేది లేదు'