తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కనిపించకుండా పోయిన మహిళ శవమై తేలింది - జగిత్యాల జిల్లా నేర వార్తలు

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామానికి చెందిన ఓ మహిళ హత్యకు గురైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కనిపించకుండా పోయిన మహిళ హతం
కనిపించకుండా పోయిన మహిళ హతం

By

Published : Oct 11, 2020, 11:08 AM IST

ఈనెల 12న కనిపించకుండా పోయిన జగిత్యాల జిల్లాకు చెందిన ఓ మహిళ హత్యకు గురైంది. ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామానికి చెందిన రాజమణి ఈనెల 12న కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికినా ఫలితం లేకుండా పోయింది.

నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం మునిపల్లె గ్రామ శివారులో ఓ మహిళ మృతదేహం ఉందనే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి కోజోన్ కొత్తూరు గ్రామానికి చెందిన రాజమణి అని గుర్తించారు.

జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలం సాతారం గ్రామానికి చెందిన దొంతుల గంగాధర్ అనే వ్యక్తి హత్య చేసి మృతదేహాన్ని అక్కడ పడేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:ఇరు రాష్ట్రాల నీటి కేటాయింపులపై కేంద్రం నివేదిక

ABOUT THE AUTHOR

...view details