తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అదృశ్యమైన అన్నాచెల్లెల్ల కేసును ఛేదించిన హయత్​నగర్ పోలీసులు - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్ పరిధిలోని కుంట్లూరులో అదృశ్యమైన అన్నాచెల్లెల్ల ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. అక్టోబర్ 29న తల్లికి తెలియకుండా ఇంటినుంచి తండ్రి వద్దకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

Missing case solved by hayath nagar police
అదృశ్యమైన అన్నాచెల్లెల్ల కేసును చేధించిన హయత్​నగర్ పోలీసులు

By

Published : Nov 4, 2020, 10:34 PM IST

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్ పరిధిలోని కుంట్లూరులో అదృశ్యమైన అన్నాచెల్లెల్లను మహబూబ్​నగర్ జిల్లా ఇల్లందులో పోలీసులు గుర్తించారు. అక్టోబర్ 29న కుంట్లూరుకు చెందిన శ్రీపాల్(13), ప్రేమ(11) ఇంట్లో తల్లికి చెప్పకుండా పారిపోయారు. అదృశ్యం కేసుగా నమోదు చేసుకుని నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు విశాఖపట్నం, నందిగామ రైల్వే స్టేషన్లలో గాలింపు చర్యలు చేపట్టారు.

కొద్దిరోజులుగా వారి తల్లిదండ్రులు గొడవపడగా తండ్రి ఇల్లందులో ఉండటంతో అక్కడికి వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. వారిద్దరిని హయత్​నగర్​ పోలీస్​స్టేషన్​కు తీసుకుని వచ్చి తల్లికి అప్పగించారు. తన పిల్లలను అప్పగించినందుకు ఆమె పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి:భర్త ఇంటి ముందు రెండు రోజులుగా భార్య ధర్నా

ABOUT THE AUTHOR

...view details