తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కూతురిపై కన్నేసిన మారు తండ్రి హతం - జగద్గిరిగుట్ట హత్య కేసు ఛేదించిన పోలీసులు

జగద్గిరిగుట్ట పరిధిలో అదృశ్యమైన వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించగా ఆరుగురిని అరెస్టు చేసినట్లు బాలానగర్ డీసీపీ తెలిపారు.

కూతురిపై కన్నేసిన మారు తండ్రి హతం
కూతురిపై కన్నేసిన మారు తండ్రి హతం

By

Published : Oct 6, 2020, 10:33 PM IST

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పరిధిలో సెప్టెంబర్​లో అదృశ్యమైన వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఏపీ కడప జిల్లాకు చెందిన వీరభద్రం అదే ప్రాంతానికి చెందిన మరో మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. ఆమె కూతురిపై మారు భర్త అయిన వీరభద్రం కన్నేశాడు. వేధింపులు తట్టుకోలేక సదురు యువతి.. తన స్నేహితుడు అయిన బాలుకు విషయం చెప్పింది.

గత నెల 16న బాలు తన ఆరుగురు స్నేహితులతో కలిసి వీరభద్రాన్ని కర్రలతో చితకబాది మట్టుబెట్టారు. మృతదేహాన్ని వికారాబాద్ జిల్లా మాధవరం గ్రామం సమీపంలో పూడ్చి పెట్టారు. భార్య ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

నిందితులను ఘటనా స్థలికి తీసుకెళ్లి పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని పరిశీలించి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఈ కేసులో మొత్తం 9 మంది ఉండగా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు బాల నగర్ డీసీపీ పద్మజా వెల్లడించారు.

ఇవీ చూడండి: బాలికపై దారుణానికి ఒడిగట్టిన కర్కశుడికి 14రోజుల రిమాండ్

ABOUT THE AUTHOR

...view details