సరూర్‌నగర్ నాలాలో గల్లంతైన నవీన్ మృతి - హైదరాబాద్ వర్షాల్లో గల్లంతు
15:38 September 21
సరూర్‌నగర్ నాలాలో గల్లంతైన నవీన్ మృతి
హైదరాబాద్ సరూర్‌నగర్‌లో వరదనీటిలో పడి కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహం సరూర్‌నగర్ చెరువులో లభ్యమైంది. తపోవన్ కాలనీలో నిన్న సాయంత్రం స్కూటీపై వెళ్తూ రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా... వెనకాల కూర్చున్న నవీన్ కుమార్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు.
వరద ప్రవాహంలో చెరువులోకి కొట్టుకుపోయి గల్లంతుకాగా... సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ బృందాలు నిన్నటి నుంచి గాలింపు చేపట్టాయి. రాత్రి 3 గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం ఆరు గంటల నుంచి మళ్లీ కొనసాగించారు. చివరికి సరూర్‌నగర్ చెరువులో నవీన్ మృతదేహం లభ్యమైంది.