పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామ సమీపంలోని గాడిదల గండి వద్ద పెను ప్రమాదం తప్పింది. మంథని పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో గాడిదల గండి గుట్టపైన వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఒక్కసారిగా బ్రేకులు వేయగా.. గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు, ముందు భాగం ధ్వంసమైంది. ట్యాంకర్ వెనుక భాగం కూడా కొద్దిగా దెబ్బతిన్నది.
ఆయిల్ ట్యాంకర్, బస్సు ఢీ.. ప్రయాణికులు సేఫ్ - Peddapalli Crime News
పెద్దపల్లి జిల్లా ఎక్లాస్పూర్ గ్రామ సమీపంలో వద్ద పెను ప్రమాదం తప్పింది. ఆయిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు అద్దాలు, ముందుభాగం స్వల్పంగా ధ్వంసమైంది.
ఆయిల్ ట్యాంకర్, బస్సు ఢీ.. ప్రయాణికులు సేఫ్
బస్సులో కొంతమంది ప్రయాణికులకు చిన్నచిన్న స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ గాడిదల గండి గుట్ట వద్ద రోడ్డు ఏటవాలుగా ఉండడంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత సంవత్సరం ఇదే స్థలంలో మూడు ప్రమాదాలు జరిగాయి. అధికారులు ఇప్పటికైనా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రహదారి విస్తరణ చేపట్టాలని కోరుతున్నారు.
- ఇదీ చదవండి:రైతన్న ఆక్రోశం.. దోమ సోకిన పంటకు నిప్పు